భారతదేశంలో వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లడాన్ని భారత్ ఎంతో గర్వంగా భావిస్తోందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. దేశం అనుసరిస్తోన్న విధానాలు ఎటువంటి వివక్షకు గురికాకుండా..పేదలు వెనుకబడిన వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆర్యసమాజ్ వ్యవస్థాపకులు స్వామి దయానంద సరస్వతి 200వ జయంతి వేడుకలను ఢిల్లీలో ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఆధునికతకు నాంది పలుకుతూనే సంప్రదాయాలను కూడా బలోపేతం చేయాల్సి ఉందన్నారు. వారసత్వం అభివృద్ధి పథంలో దేశం పయనిస్తోందన్నారు. పర్యావరణంలో ప్రపంచానికే భారత్ చూపిస్తుందన్నారు. ఈ యేడాది జీ20 సదస్సును నిర్వహించడం కూడా ఎంతో గొప్ప గర్వకారణమన్నారు. మహిళ సాధికారితకు దయానంద సరస్వతి గొంతుకగా మారారని అన్నారు. సామాజిక వివక్ష అంటరానితనంపై పోరాటానికి అది ఎంతో దోహదం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా సియాచిన్లో బాధ్యతలు నిర్వర్తించడం నుంచి రఫేల్ వంటి యుద్ధ విమానాలు నడిపే వరకూ మహిళలు ఎన్నో గొప్ప ఆశయాలు సాధిస్తున్నారని అన్నారు.
ఇవి కూడా చదవండి…