ప్రకృతి బీభత్సం భూకంపానికి టర్కీ అతలాకుతలమైంది. సోమవారం తెల్లవారుజాము 4:17 గంటల సమయంలో ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం సంభవించగా వేలాది మంది మరణించారు. భూకంప దృశ్యాలు అందరిని కలచివేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టర్కీ భూకంపంపై స్పందించారు మంత్రి కేటీఆర్. టర్కీ, సిరియాలో చోటు చేసుకున్న భూకంప దృశ్యాలు తనను తీవ్రంగా కలిచివేశాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు కేటీఆర్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన మానవాళికి చాలా బాధాకరమని…టర్కీ, సిరియా ప్రజలకు ఆ భగవంతుడు మరింత శక్తినివ్వాలని ప్రార్థించారు.
Shocked to see the visuals of devastation in Turkey & Syria! Truly a very sad day for humanity
Prayers for strength & wholehearted condolences to the bereaved families 🙏#TurkeyEarthquake
— KTR (@KTRBRS) February 7, 2023