పెళ్ళికి ముందు గ్లామర్ డోస్ తో పిచ్చెక్కించిన హీరోయిన్స్, పెళ్ళి తర్వాత అంత డేర్ చెయ్యలేకపోతున్నారు. ఒక్కోసారి అందాల ఆరబోతకు సై అంటున్నా…అవకాశాలు నిల్. దీంతో వచ్చిన అవకాశాల్ని వదులుకోలేక ఏ క్యారెక్టర్ కైనా రెడీ అయిపోతున్నారు పెళ్ళైన భామలు.
గ్లామర్ డోస్ తో దూసుకుపోయిన అప్పటి హీరోయిన్లని ఇప్పటి దర్శక నిర్మాతలు పట్టించుకోవట్లేదు. ఒకవేల పట్టించుకున్నా…అడపాదడపా పాత్రలకే పరిమితం చేస్తున్నారు. దీంతో వారు కూడా సర్థుకుపోక తప్పట్లేదు.
అయితే పెళ్ళి తర్వాత కూడా రీ ఎంట్రీ ఇస్తూ..సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసిన హీరోయిన్లూ ఉన్నారు. చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేకపోయినా..సెకండ్ ఇన్నింగ్స్ తో మళ్ళీ ప్రేక్షకులముందుకొచ్చామనే ఆనందంతో అడ్జెస్ట్ అవుతున్నారు. అయితే ఇక్కడ కూడా ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకోక తప్పదు… అప్పటి హీరోయిన్లు వారి అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి రీల్ లైఫలోకి, రీ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇలా ఇటీవలే రీ ఎంట్రీ కి రెడీ అయిన భామల లిస్ట్‌లలో రాశీ కూడా ఉంది.
అయితే ఇప్పుడు మరో భామ కూడా రీ ఎంట్రీకి రెడీ అయిపోతోంది. కారణం ఆర్థిక పరంగా సమస్యలుండడమేనని టాక్. ఆ మాజీ హీరోయినే భూమిక. పవన్ కల్యాణ్ సరసన ‘ఖుషీ’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా పలు సినిమాల్లో నటించింది భూమిక. అయితే నటిగా బిజీగా ఉన్న సమయంలోనే యోగా మాస్టర్ భరత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భూమిక తన భర్తను సినీ నిర్మాతగా నిలబెట్టే ప్రయత్నం చేసింది.
కానీ..ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో ఆర్థికంగా దెబ్బతింది. ఈ క్రమంలో భార్యా భర్తలిద్దరికీ విభేదాలు తలెత్తాయి. విషయం విడాకుల వరకు వచ్చిందని ఆ మధ్యన బాలీవుడ్ లో టాక్ వినిపించింది. వ్యక్తిగత సమస్యల గురించి భూమిక ఎన్నడూ బయటపెట్టకపోయినా.. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మరోసారి నటనవైపు దృష్టి సారించింది. కానీ అవకాశాలు మాత్రం భూమిక కి ఆమడ దూరంలో ఉన్నాయి.
దాంతో తాను ‘ధోనీ’ సినిమాలో ధోనీకి అక్కగా నటించేందుకు కూడా సిద్ధపడింది. ఆ తర్వాత కూడా భూమికకు అవకాశాలు తలుపుతట్టలేదు. ప్రస్తుతం అవకాశాలొస్తే..అక్క, వదిన పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధమంటూ తెలిసినవారితో చెబుతోందట. మొత్తానికి భూమిక కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తోంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ ఏ మేరకు భూమికని కష్టాల్లోంచి బయటపడేస్తుందో చూడాలి.