7 లక్షల వరకు నో ట్యాక్స్‌..

52
- Advertisement -

2023-24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌. బడ్జెట్‌లో వేతన జీవులకు బిగ్ రిలీఫ్ కల్పించారు. ఇప్పటివరకు 5 లక్షల ఇన్ కమ్ ఉన్నవారు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని 7 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పన్ను పరిమితిపై కీలక ప్రకట చేయగా సభ్యులంతా హర్షం వ్యక్తం చేశారు.

5 ల‌క్ష‌ల నుంచి ఏడు ల‌క్ష‌ల‌కు ఆదాయ‌ప‌న్ను ప‌రిమితిని పెంచుతున్న‌ట్లు మంత్రి నిర్మ‌ల తెలిపారు. ఇక నుంచి ఏడు ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు ఎటువంటి ప‌న్ను ఉండ‌ద‌ని ఆమె వెల్ల‌డించారు. రూ.6 ల‌క్ష‌ల నుంచి 9 ల‌క్ష‌ల ఉన్న‌వారికి 10 శాతం ప‌న్ను, 9 ల‌క్ష‌ల నుంచి 12 ల‌క్ష‌ల వ‌ర‌కు 15 శాతం ప‌న్ను విధించ‌నున్నారు. కొత్త ప‌న్ను విధానంలో ఈ రిబేట్‌ను క‌ల్పిస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు. 2020లో ఆరు ఇన్‌కం స్లాబ్స్‌లో ప‌న్ను విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టామ‌ని, దాన్ని అయిదుకు త‌గ్గించామ‌న్నారు.

15 ల‌క్ష‌ల ఆదాయం దాటిన వారికి 30 శాతం ప‌న్ను విధించ‌నున్నారు. కొత్త ప‌న్ను విధానం ప్ర‌కారం స‌ర్‌చార్జ్‌ను 37 నుంచి 25 శాతానికి త‌గ్గించిన‌ట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -