దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు..

42
- Advertisement -

ప్రపంచంలోనే భారత్ ఐదో పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉందని వెల్లడించారు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. యువత ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం మాట్లాడిన నిర్మలా.. దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు ఏర్పాటుచేస్తున్నామని వెల్లడించారు. మెడికల్ కాలేజీలతో పాటు దేశ వ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఎస్సీ వర్గాలకు ప్రత్యేకంగా 15 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.

వ్యవసాయం కోసం డిజిటల్‌ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు..వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామన్నారు.వ్యవసాయ స్టార్టప్స్‌కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని..పత్తిసాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు. పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. చిరుధాన్యాల పంటలకు సహకారం. ఇందుకోసం ‘శ్రీఅన్న’ పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు.

11.7కోట్లతో టాయ్‌లెట్స్‌ నిర్మాణం చేపట్టాం అని తెలిపారు. 44కోట్ల మందికి పీఎం సురక్షా బీమా యోజన పథకం అందుతోందన్నారు. ఉచిత ఆహార ధాన్యాల పథకానికి 2లక్షల కోట్లను కేంద్రం భరిస్తోందని తెలిపారు. రైతు, పేద, మధ్యతరగతి వారి కోసం బడ్జెట్ రూపొందించామని.. తొమ్మిదేండ్లలో అతిపెద్ద ఆర్థికశక్తిగా భారత్ ఎదిగామన్నారు. తలసరి ఆదాయాన్ని డబుల్ చేశామన్నారు. 102 కోట్లమందికి వ్యాక్సిన్ ను ఉచితంగా అందించామని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -