తెలంగాణలో నిధుల వరద ఏమైంది..?

74
- Advertisement -

తెలంగాణలో నిధుల వరద పారిస్తాం అన్న ఈటల ఎక్కడ అని ప్రశ్నించారు. మోదీ పాలన కంటే సీఎం కేసీఆర్ పాలన బాగుందని బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమని అంటివి కదా నీకిది తగునా అని ఈటలను ప్రశ్నించారు. కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంటలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కరీంనగర్ జిల్లాలో మ‌హాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ బాలుర‌, బాలిక‌ల గురుకుల పాఠ‌శాల భ‌వ‌న స‌ముదాయాలు, ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీ భ‌వ‌నం, క‌స్తూర్బా గాంధీ బాలిక‌ల విద్యాల‌యాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్ ఎర్రబెల్లి దయాకర్ రావు వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మంత్రి కేటీఆర్ భోజనం చేశారు. విద్యార్థులతో కలిసి కేటీఆర్‌ ముచ్చటించారు.

సరిగ్గా 14నెలల కిందట ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల గెలిచారు. మరీ హుజూరాబాద్‌లో నిధుల వరద పారిందా అని ప్రశ్నించారు. కనీసం ఒక్క పైసా ఢిల్లీ నుంచి వచ్చిందా అని ప్రశ్నించారు. ఈటల మాటలు కోటలు దాటుతాయ్‌ …చేతలు మాత్రం కడప దాటయ్ అని మండిపడ్డారు. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని తండ్రిలాంటి వ్యక్తిని పట్టుకొని అరిష్టమని మాట్లాడుతున్నరు ఇది మీకు తగునా అని ప్రశ్నిస్తున్నా. ఎవరి పాలన ఈ దేశానికి, రాష్ట్రానికి అరిష్టమో ప్రజలు ఆలోచన చేయాలి. 2014లో ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం…జన్‌ధన్ ఖాతాలు ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.15లక్షల ధనాధన్ వేస్తానని చెప్పారు. ఎవరికైనా వచ్చాయా? అందరి డబ్బులు ఒక్కడి ఖాతాల్లో పడి ప్రపంచంలో ధనవంతుడిగా ఎదిగారని మండిపడ్డారు.

2022నాటికి దేశంలో అందరికి పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. రైతుల ఆదాయం డబులల్ చేస్తా అని అన్నారు. ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లిస్తా…కరెంటు లేని ఊరు ఉండకూడదు అని ఉత్తర కుమారా పలుకులు పలికిన మోదీ ఎమైనా నెరవేర్చవా అని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మోదీ దేవుడు అంటున్నడు. ఎవడికి దేవుడు. అయితే నీకు దీవుడేమో సీటిచ్చినందుకు. ఎవరికి దేవుడు ఈ దేశంలో మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి. రూ.400ఉన్న సిలిండర్‌ ధరను రూ.1200చేసిన వ్యక్తి దేవుడా సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ దేవుడా అని ఆలోచించుకోవాలని అన్నారు. 2014నాటికి పెట్రోల్‌ లీటర్‌కు రూ.70 కానీ ఇప్పడు రూ.110ఎలా పెరిగిందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో పేదలను కొట్టి.. పెద్దలకు పెట్టే ప్రభుత్వం. కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వం అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి…

రచ్చ లేపుతోన్న బీజేపీ రాజకీయం !

గవర్నర్ల తీరుపై పార్లమెంట్‌లో చర్చ…

శాండోస్‌…గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌

- Advertisement -