ఈ దేశం ఖాన్‌లనే ప్రేమిస్తుంది…

28
kangana
- Advertisement -

బాలీవుడ్ క్వీన్ నిత్యం వార్తల్లో నిలిచే ఈ భామ మరోసారి వార్తలోకెక్కింది. అయితే కంగానా కామెంట్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలెట్టింది. ఈ దేశం ఖాన్‌లను మాత్రమే ప్రేమిస్తుందంటూ మాట్లాడింది. తాజాగా బాలీవుడ్‌లో గత సంవత్సరంగా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడుతున్న హిందీ సినిమాల పరంపర బ్రేక్‌ చేస్తూ వచ్చిన పఠాన్‌ సినిమా…వీకెండ్‌లో రూ.200కోట్ల క్లబ్బులో చేరింది.

ఈ సందర్బంగా ఈ చిత్ర విజయాన్ని విశ్లేషిస్తూ.. హిందువులు ముస్లింలూ షారుఖ్‌ని సమానంగా ప్రేమిస్తారు. బహిష్కరణ వివాదాలు సినిమాకి సహాయం చేస్తాయి. రొమాన్స్ మంచి సంగీతం ఉంటే చాలు సినిమాలు ఆడతాయి. అందుకే భారత్‌ సెక్యులర్ దేశం అంటూ ఓ నెటిజన్ కామెంట్‌ పెట్టగా దీనిపై కంగనా తనదైన శైలిలో స్పందించింది.

‘చాలా మంచి విశ్లేషణ. ఈ దేశంలో చాలా సందర్భాలలో కేవలం ఖాన్‌లను మాత్రమే ప్రేమిస్తుంది. ముస్లిం హీరోయిన్లంటే మక్కువ చూపిస్తుంది. కాబట్టి ఈ దేశంలో ద్వేషం, పాసిజం ఉందని నిందలు వేయడం చాలా అన్యాయం. ప్రపంచంలో భారత్‌ లాంటి దేశం ఇంకోటి లేదు’’ అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై భిన్న స్వరాలు బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. మరీ వేచి చూడాలి..దీన్ని ప్రభావం ఎమర్జెన్సీపై ఉంటుందా లేదా అనేది విడుదల నాటికి తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి…

- Advertisement -