అంశాల స్వామి కన్నుమూత..కేటీఆర్ సంతాపం

32
- Advertisement -

తెలంగాణ ఉద్యమం మొదలయిందే నీళ్లు నిధులు నియమాకాలు. అలాంటి తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఫ్లోరిసిస్ బాధితులు కూడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా కీలకభూమిక పోషించింది. నాటి ఉద్యమ సమయంలో ప్రధాని వాజ్‌పేయి టేబుల్‌ పై పడుకోబెట్టిన అంశాల స్వామి(32)…తాజాగా మృతి చెందారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ట్రైసైకిల్ నుండి కిందపడి తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందారు.

అంశాల స్వామి విజ్ఞప్తి మేరకు కేటీఆర్‌ గతంలో డబుల్‌ బెడ్రూం ఇంటిని పంపిణీ చేశారు. మరియు గృహప్రవేశానికి సైతం కేటీఆర్ హాజరయ్యారు. అంతేకాదు జీవనోపాధి కోసం అంశాల స్వామికి సెలూన్‌ను కూడా ఏర్పాటు చేశారు.

అంశాల స్వామి మృతిపట్ల మంత్రి కేటీఆర్‌ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఫ్లోరోసిస్ బాధితుడైన స్వామి ఫ్లోరైడ్‌ సమస్యపై అవిశ్రాంతంగా పోరాడారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. ఎప్పటికీ తన మనసులో గుర్తుండిపోతాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి…

భారత్‌లోని ఫుడ్ ఫారెన్‌లో బంద్…

కిలిమంజారోపైన తెలంగాణ ఖ్యాతి…

తారకరత్నకు తీవ్ర అస్వస్థత

- Advertisement -