రాగి సంగటితో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?

40
- Advertisement -

సమ్మర్లో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా.. సంగటి, అంబలి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. జొన్నలు, రాగులతో చేసిన అంబలి లేదా సంగటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ను దూరం చేసుకోవచ్చు.

ఎన్నో రోగాలను తగ్గించేందుకు ఉపయోగపడే అత్యంత పోషక పదార్ధాలు రాగి సంగటిలో ఉన్నాయి. పూర్వకాలంలో రాగిసంగటి తినకుండా మనిషి ఉండేవాడు కాదు. రాగిసంగటిలోని పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. రాగి రొట్టె, రాగి దోశ, రాగి గంజి ఇలా మనకు తాతల కాలం నుంచి రాగితో రకరకాల వంటకాలను ఆరగిస్తున్నాం.

ప్రస్తుతం రాగి గంజి, రాగిమాల్ట్‌గా మారింది. మార్కెట్లోని బూస్టు, హార్లిక్స్‌ల సరసన చేరుతోంది. బీపీ, చక్కెర వ్యాధులకు రాగిమాల్ట్ చాలా ఉపయోగకరం. బీపి,షుగర్‌ తదితర వాధ్యులను కంట్రోల్‌ చేయడానికి రాగి ఎంతగానో ఉపయోగపడుతుంది. రాగిసంగటి తరచూ తీసుకోవడం వలన కడుపులో మంట, వాంతులు, వికారం, మలబద్ధకాన్ని తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. మజ్జిగ, పాలలో రాగిమాల్ట్‌ను కలుపుకుని త్రాగితే సొరియాసిస్, చర్మవ్యాధుల నివారణకు మెడిసెన్‌లా పనిచేస్తుంది.

రాగులను రోజూ వారీ డైట్‌లో చేర్చుకోడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చని న్యూట్రీషన్లు చెబుతున్నారు. రాగుల్లో యాంటీఆక్సిడెట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వయసు మీద పడినట్లు కనిపించనివ్వదని వారు సూచిస్తున్నారు.రాగుల్లో అమినోయాసిడ్స్‌ ఆకలిని తగ్గించి… బరువును నియంత్రిస్తుంది. రాగిపిండితో తయారు చేసే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. రాగుల్లో ఉన్న ఫైబర్‌ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు.

ఇంకా రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. అలాగే వయసు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం బాగా సహాయపడుతుంది. ఇంకా మహిళలు ఎముకల పట్టుతత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగిమాల్ట్‌ ఎముకల పట్టుతత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది.

సాధారణంగా రాగులతో తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఆందోళన, వ్యాకులత, నిద్రలేమి పరిస్థితులను దూరం చేస్తుంది. రాగి మైగ్రేన్‌ సమస్యను నివారించడం కోసం కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Also Read:పాదోతానాసనంతో ఆ సమస్యలు దూరం!

- Advertisement -