చాదర్‌ను సమర్పించిన సీఎం…

43
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరపున చాదర్ సమర్పించారు. ప్రతి యేటా తెలంగాణ ప్రభుత్వం చాదర్‌ను సమర్పించనున్నారు. ఈ సందర్బంగా మత పెద్దల ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో సామూహిక ప్రార్థనలు చేశారు. రాష్ట్రం, దేశం ప్రగతి పథంలో ముందుకు సాగాలని దేశప్రజలందరూ ఐక్యమత్యంతో జీవించేలా దీవించాలని అల్లాను ఈ సందర్భంగా మత పెద్దలు ప్రార్థించారు. అనంతరం చాదర్‌ను వక్ఫ్‌ బోర్డు అధికారులకు సీఎం కేసీఆర్‌ అందజేశారు.

ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్‌ అలీ, సాంఘిక మైనారిటీ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఆర్ధిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, సాంస్కృతిక పర్యాటక క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

ఖమ్మం సభ ఒక చరిత్ర:నామా

ఆగ్నిమాపక శాఖపై కేటీఆర్ సమీక్ష

తెలంగాణలో జనసేన.. ప్రభావమెంతా ?

- Advertisement -