- Advertisement -
గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత సైన్యం తన ఆయుధ ప్రదర్శనలను నిర్వహించనుంది. కానీ ఇందులో స్పెషల్‌గా ఏముందని అనుకుంటున్నారా…మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగంగా తయారుచేసుకున్న ఆయుధాలను ప్రదర్శంచనుంది. 74వ గణతంత్ర దినోత్సవం కోసం ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సీసీ ముఖ్య అతిథిగా రానున్నారు.
ఢిల్లీ పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పరేడ్‌కు సంబంధించిన వివరాలను ఢిల్లీ ఏరియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ భవినీష్ కుమార్ వెల్లడించారు. ఈసారి కర్తవ్య పథ్(రాజ్‌పథ్)లో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 10.30కు ఈ పరేడ్ విజయ్ చౌక్ వద్ద ప్రారంభమై ఎర్రోట వరకు సాగతుందని తెలిపారు. ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు వాయుసేన నేవీకి చెందిన ఒక్కో బృందం దీనిలో పాల్గొంటాయని మేజర్ భవినీష్ కుమార్ తెలిపారు.
- ఈజిప్ట్ నుంచి వచ్చిన ప్రత్యేక పటాలం కూడా పరేడ్‌లో పాల్గొంటుంది. దీనిలో 120మంది ఈజిప్ట్ సైనికులు ఉంటారు. గణతంత్ర దినోత్సవంకు ఈజిప్ట్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
- సంప్రదాయ 21గన్ సెల్యూట్‌కు ఉపయోగించే పురాతన బ్రీటిషర్ గన్స్‌కు బదులుగా 105ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్‌తో భర్తీ చేయనున్నారు.
- తొలిసారి ఆగ్నివీరులను ఈ పరేడ్‌లో పాల్గొననున్నారు. ఆగ్ని వీరుల స్కీంపై గతంలో దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే.
- తొలిసారి బీఎస్ఎఫ్ కామెల్ కంటిజెంట్స్లో భాగంగా మహిళా బీఎస్ఎఫ్ దళాలు పాల్గొంటున్నాయి.
- నారీశక్తి ప్రదర్శనలో భాగంగా నేవీలో 144మంది సెయిలర్స్ బృందానికి మహిళా అధికారులు నేతృత్వం వహించనున్నారు.
- భారత్‌లో తయారైన ఆకాశ్ ఎయిర్ ఢిఫెన్స్ మిస్సైల్ క్షిపణులు, బ్రహ్మోస్ సూపర్ సోనిక్, నాగ్ వంటి క్షిపణులను ప్రదర్శించనున్నారు. కే-9వజ్ర హౌహిట్జర్స్, ఎంబీటీ ఆర్జున్, నాగ్ యాంటీ గైడెడ్ మిస్సైల్, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికిల్స్ పాల్గొననున్నాయి.
- ఫ్ల్తైపాస్ట్‌లో మొత్తం 44 విమానాలు పాల్గొననున్నాయి. వీటిలో తొమ్మిది రాఫెల్ జెట్ విమానాలు కూడా ఉన్నాయి. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి అటాక్ హెలికాప్టర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి…
దిగ్విజయ్ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం..
అబ్బే అదేం లేదు :జెఫ్ బెజోస్
ఈ కషాయంతో తాగితే.. ఆ రోగాలు మటుమాయం !
- Advertisement -