వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్..

55
whatsapp
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సాప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ మరో అదిరే ఫీచర్‌ని తీసుకొచ్చింది.

ఇకపై వాట్సాప్‌లో తేదీల వారీగా సందేశాలను అన్వేషించి గుర్తించొచ్చు. కొత్త అప్ డేట్ ద్వారా ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు ఈ ఫీచర్ తీసుకొచ్చింది. యూజర్లు ముందు తమ ఫోన్ లో ఉన్న వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

అలాగే ఇతర యాప్స్ లో ఉన్న వీడియో, ఫొటోలు, డాక్యుమెంట్లను వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవాలని అనుకుంటే వేరే యాప్ లో ఉన్న వాటిని డ్రాగ్ చేసి తీసుకొచ్చి వాట్సాప్ లో డ్రాప్ చేసే ఫీచర్ కూడా తాజా అప్ డేట్ తో అందుబాటులోకి వస్తుంది. తొలుత సెర్చ్ బార్ కు వెళ్లాలి. అక్కడ తేదీ, నెల, సంవత్సరం టైప్ చేస్తే చాలు ఆ రోజున ఏఏ కాంటాక్టులతో ఏమేమి షేర్ చేసుకున్నారనే వివరాలు వస్తాయి.కావాల్సిన దానిని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ కుడిచేతివైపు కార్నర్లో కేలండర్ ఐకాన్ కనిపిస్తుంది. కావాల్సిన తేదీని అక్కడ ఎంపిక చేసుకుంటే ఆ రోజు మెస్సేజ్ లు అక్కడ కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -