ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ హైదరాబాద్ వేదికగా 2030నాటికి రూ.36300కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈసందర్బంగా కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ ఏడబ్ల్యూఎస్ ప్రకటన సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తెలంగాణ పౌరులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇ-గవర్నెన్స్ హెల్త్‌కేర్ పురపాలక కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు డేటా సెంటర్లను ఉపయోగించుకుంటామని తెలిపారు.
డెటా సెంటర్ల నిర్వహణకు హైదరాబాద్ సరైన స్థలంగా పేర్కొన్నారు. ఈడేటా సెంటర్లతో భారతదేశంలోనే తెలంగాణ ప్రగతిశీల హబ్‌గా బలోపేతమవుతుందన్నారు. హైదరాబాద్‌లోని చందన్‌వెళ్లి ఎఫ్ఏబీ సిటీ ఫార్మా సిటీలోని డేటా సెంటర్లలో దశల వారీగా పెట్టుబడులు పెట్టనుంది. దావోస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్ధిక సదస్సుకు మంత్రి కేటీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే.
KTR welcomes AWS enhancing investment to a whopping Rs.36,300 cr in Hyderabad #HappeningHyderabad #KTR https://t.co/NDGWtSV0bY
— KTR (@KTRTRS) January 20, 2023
ఇవి కూడా చదవండి…