అర్థంలేని ఆరోపణలు :గుత్తా

16
- Advertisement -

దేశాన్ని లౌకికశక్తిగా పునర్మించేందుకు ఖమ్మం సభ జరిగిందన్నారు మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి. దేశం యొక్క భవిష్యత్‌ తెలంగాణ నుంచి ప్రారంభమవుతుందని దీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. దేశంలో లౌకికేతర శక్తులు ప్రభలతున్నాయన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు తిప్పి కొట్టడం కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న కేంద్రంపై పోరాటం ఖమ్మం సభ ద్వారా మొదలైందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు.

ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ కేంద్రం అవినితీకి పాల్పడుతున్నదన్నారు. హైదరాబాద్‌లో నిజాం ఆఖరి వారసుడి అంత్యక్రియలపై కూడా రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఓట్ల కోసం మత రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా గవర్నర్‌ వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని విమర్శించారు. ప్రభుత్వం ఆమోదించిన ఏడు బిల్లులు గవర్నర్ ఆమోదించకుండా తనవద్దే పెట్టుకుంటే అభివృద్ధి ఏలా జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పీసీసీ ఛీఫ్ను జోకర్‌ అని, అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.

ఇవి కూడా చదవండి…

ప్రజలు కోరిన చోట శిబిరాలు:హరీశ్‌

లక్షల కోట్ల సహజ సంపద ఈ దేశ సొత్తు

ఖమ్మం జిల్లాకు వరాల్లు:సీఎం

- Advertisement -