లైగర్ సినిమాతో కుర్రకారును ఆకట్టుకుంది అనన్య పాండే. ఆ సినిమాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. అయినా ఉపయోగం లేకుండా పోయింది. లైగర్ డిజాస్టర్ దెబ్బకు ఆ తరువాత అనన్య పాండేకు సరైన సినిమా పడలేరు. ఇలాంటి పరిస్థితుల్లో అనన్య పాండేకు డిమాండ్ పెరుగుతుందని నమ్మకం లేదు. అందుకే అనన్య పాండే నే తగ్గుతుంది. రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా డిమాండ్స్ లేకుండా ప్రపోజల్స్ పెడుతుంది. దాంతో అనన్య పాండేకు సినిమాలు అయితే చేతిలోకి బాగానే వస్తున్నాయి. లేటెస్ట్ గా పవర్ స్టార్ సినిమాకు కూడా ఆమె ఎంపికయింది. అయితే.. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా కాదు లేండి.
పవన్ కళ్యాణ్ సినిమాలో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. సముద్రఖని డైరక్షన్ లో పవన్ కళ్యాణ్..సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా నిర్మించే రీమేక్ సినిమాలో సాయి తేజ్ కి హీరోయిన్ గా అనన్య పాండే ను తీసుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాలో ఇప్పటికే కేతిక శర్మను ఫైనల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అనన్య పాండే పేరు వినిపిస్తోంది. మరోపక్క ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ వుండదు. పవన్ పాత్ర సినిమాలో ప్రత్యేకం. కాబట్టి.. అనన్య పాండే కచ్చితంగా సాయి తేజ్ కే హీరోయిన్ అయ్యి ఉంటుంది.
మరీ సాయి తేజ్ తో అనన్య పాండే ఏ రేంజ్ రొమాన్స్ ను చేస్తోందో చూడాలి. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఈ సినిమా మొత్తాన్ని చకచకా నాలుగు నెలల్లో పూర్తి చేసే ఆలోచనలో వున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా మాత్రమే ఈ ఏడాది విడుదలకు అవకాశం వున్న సాయి తేజ్ – అనన్య పాండే సినిమా అనుకోవచ్చు.
ఇవి కూడా చదవండి…

