దూరం జరిగిన శ్రీముఖి !

18
- Advertisement -

బుల్లితెర ‘రాములమ్మ’ యాంకర్ శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఫాలోయింగ్ తో పాటు శ్రీముఖి పై ట్రోలింగ్ కూడా అధికమే. శ్రీముఖిని తరుచుగా ట్రోల్ చేస్తుంటారు సోషల్ మీడియా జనం. మొదట్లో తనని ట్రోల్ చేసేవారికి, విమర్శించే వారికి గట్టిగా రిప్లై ఇచ్చేది శ్రీముఖి. ఆ తర్వాత కొన్నాళ్ళకు వారితో గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టింది. అనసూయలా తాను నెటిజన్స్ ను బండబూతులు తిట్టింది. ఐతే, ఒక దశలో ట్రోలింగ్ సెగ తట్టుకోలేక సైబర్ పోలీసులను కూడా ఆశ్రయించింది. ఐతే, శ్రీముఖి ఇప్పుడు కొంచెం తగ్గినట్లు కనిపిస్తోంది. అసలు సోషల్ మీడియాకి కూడా ఈ మధ్య శ్రీముఖి దూరం జరిగింది.

గత కొన్ని రోజులుగా అయితే సోషల్ మీడియాలో శ్రీముఖి తన యాక్టివిటీని బాగా తగ్గించింది. అలాగే, ఎవరి కామెంట్లకు రెస్పాండ్ కావడం లేదు. ఫోటోషూట్ షేరింగ్ లు కూడా చాలా మేరకు శ్రీముఖి తగ్గించుకుంది. మొత్తానికి శ్రీముఖి ఇప్పుడు లైఫ్ లో ప్రశాంతత కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది. అందుకే, ఆన్ లైన్ గొడవలకు దూరమైందట. నిజానికి రీసెంట్ గా శ్రీముఖి పెళ్లి పై చాలా పుకార్లు షికార్లు చేశాయి. ‘క్రేజీ హాట్ సెన్సేషన్’ అనిపించుకున్న ఈ బ్యూటీ, ఈ ఏడాది పెళ్లి చేసుకుంటుందని వార్తలు అల్లారు.

ముఖ్యంగా శ్రీముఖి ఓ బిజినెస్‌మెన్‌ తో ఏడడుగులు వేయబోతుందంటూ ఆమె తండ్రి ఫోటోనే పెళ్లి కొడుకు ఫోటోగా ఎడిట్ చేసి.. నెట్టింట జోరుగా ప్రచారం చేశారు. ఆ వార్త చూసి శ్రీముఖి బాగా ఎమోషనల్ అయింది. నా తండ్రితోనే నాకు పెళ్లి చేస్తారా ? అంటూ ఆవేదన చెందింది. ఈ వార్తే ఆమెను బాగా బాధ పెట్టింది. అందుకే.. కొన్నాళ్ళు ఆన్ లైన్ ముచ్చట్లను తగ్గించుకుంటూ ముందుకు పోతుంది.

ఇవి కూడా చదవండి…

సుమకు చుక్కలు చూపించిన చిరు!

టాలీవుడ్ టాప్ ఓపెనర్ బాలయ్యే

మరాఠీ వేద్ రికార్డుల వర్షం…

- Advertisement -