యాదాద్రికి మూడు రాష్ట్రాల సీఎంలు..

68
- Advertisement -

బుధవారం యాదాద్రిలో మూడు రాష్ట్రాల సీఎంలు పర్యటించనున్నారు. కేరళ సీఎం పినరాయి విజయన్ తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకుంటారు. బుధవారం ఉదయం 11గంటలకు సీఎం కేసీఆర్‌తో కలిసి యాదగిరిగుట్టకు చేరుకుంటారు. స్వామివారి దర్శనం అనంతరం ఖమ్మం చేరుకుంటారు.

ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొంటారు. మూడు రాష్ట్రాల సీఎంలతో పాటు పలు పార్టీల ప్రముఖులు నేడు రాష్ట్రానికి చేరుకోనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక ఖమ్మం బహిరంగసభను సక్సెస్ చేసే బాధ్యతను మంత్రి హరీశ్ రావుకు అప్పగించారు. ఐదురోజులుగా హరీశ్ ఖమ్మంలోనే మకాం వేసి బహిరంగసభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది ఈ బహిరంగసభకు వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -