ఏదైనా ఒక భాషలో హిట్ట్ అయిన సినిమాను మరోభాషలో రీమేక్ చేస్తారు. అలాంటి కోవలోకి వచ్చిందే..మజిలీ. అవును తెలుగులో నిర్మించిన మజిలీ సినిమాను మరాఠీ భాషలో రీమేక్ చేశారు. ఇందులో నాగచైతన్య పాత్రలో రితేశ్‌దేశ్‌ముఖ్, సమంత పాత్రలో జెనీలీయా రితేశ్ నటించారు. అయితే ఇది విడుదలైన అనతి కాలంలో అనేక రికార్డులను తిరగరాస్తుంది.
రితేశ్‌దేశ్‌ముఖ్ వేద్ సినిమాతో మెగా ఫోన్ పట్టారు. దాదాపుగా పెళ్లై పదేళ్ల తర్వాత మరోసారి తెరపై కనిపించింది బొమ్మరిల్లు హసిని. నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 30న విడుదలై ఏకంగా తొలిరోజు రూ.3.5కోట్లు వసూలు చేసింది. కేవలం రూ.15కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం రూ.47.66కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ప్రముఖ సినీ విశ్లేషుకుడు తరుణ్ ఆదర్శ్ తెలిపారు.
మరాఠా బ్లాక్ బస్టర్ సైరాట్ సినిమా రూ.110కోట్లు వసూలు చేసి మొదటి స్థానంలో ఉండగా…వేద్ తర్వాత కొనసాగుతుంది. మొత్తమీద రీమేక్‌ల పర్వం మాత్రం బాలీవుడ్‌ను వెంటాడుతుంది. ప్రాంతీయ సినిమాల పరంపర కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి…
పోలీస్ పాత్రలో డార్లింగ్..!.
అవతార్ 2 దర్శకుడి పై జక్కన్న ట్వీట్
వీరయ్య సక్సెస్ పై చిరు స్పందన