వీరసింహారెడ్డి కలెక్షన్స్

163
- Advertisement -

నందమూరి బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటించిన ‘వీరసింహారెడ్డి’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

మాస్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా తెలంగాణ , ఆంద్రప్రదేశ లో 23.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ దాటేసిన వీర సింహారెడ్డి రాబోయే రోజుల్లో మరింత కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తున్నారు. వీకెండ్ పైగా పండుగ సెలవలు ఉండటంతో ఈ సినిమా అతి త్వరలోనే 100 కోట్ల గ్రాస్ రీచ్ అవుతుందనిపిస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీత దర్శకుడు.

ఇవి కూడా చదవండి…

దసరా షూటింగ్‌ పూర్తి

వరల్డ్‌ టాప్‌ 4లో బాద్‌షా…

వాల్తేరు వీరయ్య పండగలా ఉంది: సుస్మిత

- Advertisement -