తపస్వి లక్షణం ఇది కాదు…బీజేపీ

56
- Advertisement -

జేడీయూ మాజీ అధ్యక్షుడు కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్  గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శరద్…ఆయన నివాసంలో స్పృహ కొల్పోగా ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

శరద్ యాదవ్ తొలిసారి మధ్యప్రదేశ్ లోని జబల్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఏడుసార్లు లోక్ సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2004 మధ్య అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. శరద్ యాదవ్ పార్టీ జేడీయూను లాలూ పార్టీ అయిన ఎల్‌జేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

శరద్‌ యాదవ్ మృతికి దేశంలోని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా పార్థీవ దేహానికి సంతాపం తెలియజేశారు. అయితే ఇదే సందర్భంలో రాహుల్ కుటుంబసభ్యులను పరామర్శించే సందర్భంలో నవ్వుతున్నారని…దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌ ద్వారా బీజేపీ నాయకులు షేర్ చేస్తున్నారు. అయితే రాహుల్‌ గతంలోనూ ఇలాగే చేశారని అప్పటి వీడియోలను, ఫోటోలను నెట్టింట షేర్‌ చేస్తూ…తపస్వి ఇలాగే ఉంటారా…కుటుంబ సభ్యులంతా బాధ పడుతుండగా నవ్వుతూ కనిపించడం తపస్వి లక్షణమేనా అని నిలదీస్తున్నారు.

2018లో కర్ణాటక మాజీ సీఎం ధరమ్ సింగ్ మరణించినప్పడూ కూడా సంతాప సభలో కుటుంబ సభ్యులను ఓదార్చుతూ నవ్వుతున్న ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు. పుల్వామా ఘటనలో చనిపోయిన అమరవీర సైనికులకు శ్రద్ధాంజలి సందర్భంగా ఫోన్‌లో బిజీగా ఉన్న ఫోటోలను కూడా షేర్‌ చేస్తూ…తపస్వి ఇలా ఉండరు కదా అని బీజేపీ నిలదీస్తుంది.

ఇవి కూడా చదవండి…

శరద్ యాదవ్ కన్నుమూత

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఒడిషా మాజీ సీఎం

ప్రజల ఆలోచన సరళి మారాలి..

- Advertisement -