యాంకర్స్ లో స్టార్స్ ఉంటారా ?, ఈ మధ్య తనను తానూ స్టార్ యాంకర్ గా రష్మి గౌతమ్ చెప్పుకొచ్చింది. సరే.. రష్మి గౌతమ్ పెళ్లి సంగతికి వస్తే.. రష్మి గౌతమ్ పై వచ్చిన పెళ్లి పుకార్లు అన్నీ ఇన్నీ కావు. గడిచిన రెండేళ్లుగా రష్మి పెళ్లిపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. కొన్నింటిని ఆమె ఖండించింది, మరికొన్నింటిని లైట్ తీసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ యాంకర్ పై వెడ్డింగ్ రూమర్స్ గుప్పుమంటున్నాయి. అయితే, ఈసారి మాత్రం ఈ టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా రష్మి గౌతమ్ సన్నిహితుల నుంచి ఈ ‘పెళ్లి మేటర్’ బయటకొచ్చింది.
వైజాగ్ కి చెందిన ఓ వ్యక్తితో రష్మి గౌతమ్ డేటింగ్ చేస్తోందట. ఆ వ్యక్తినే రష్మి గౌతమ్ పెళ్లాడనుందంట. రీసెంట్ గా ఇద్దరూ పెళ్లిపై ఓ అవగాహనకు వచ్చారట. ఈ పెళ్లికి సదరు వరుడు తల్లిదండ్రుల నుంచి కూడా అనుమతి వచ్చిందని తెలుస్తోంది. నిజానికి రష్మి గౌతమ్ అతనితో గతంలోనే ఓసారి గుడిలో పెళ్లి తంతు కానించిందట. కాకపోతే.. కెరీర్ కోసం బయటకు చెప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం అందరికీ తెలిసేలా చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడానికి రష్మి గౌతమ్ ఫిక్స్ అయ్యింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రష్మి గౌతమ్. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో రష్మి ముచ్చట్లు కూడా పెడుతుంది, తన కొత్త ఫొటోషూట్ స్టిల్స్ షేర్ చేస్తుంది. రకరకాల ఫన్నీ వీడియోస్ పోస్ట్ చేస్తుంది. అదే హంగామాలో భాగంగా ఈ పెళ్లి పుకారుపై కూడా రష్మి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. అయితే చాలామంది మాత్రం రష్మి గౌతమ్, తన సోషల్ మీడియా వేదికగా పెళ్లి కబురు మోసుకొస్తుందని ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి..