మస్క్‌ చెత్త రికార్డు.. 16 లక్షల కోట్లు లాస్

53
- Advertisement -

ఎలాన్ మస్క్‌..తరచూ వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న దగ్గరి నుండి రోజు ఈ పేరు వినిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు..దాదాపు 340 బిలియన్ డాలర్ల సంపద. అయితే ఓడలు బండ్లు అవుతాయి..బండ్లు ఓడలు అవుతాయి అంటే ఇదేనేమో. ఒక్క ఏడాదిలోనే మస్క్ తలరాత మారిపోయింది.

భారత కరెన్సీలో మస్క్ సంపద రూ.28 లక్షల కోట్లు. అయితే ఇప్పుడు తాజాగా మస్క్ తన చెత్త నిర్ణయాలతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.ఒక్క ఏడాదిలోనే ఏకంగా 200 బిలియన్ డాలర్లు అంటే రూ. 16 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు మస్క్‌. ఇంతపెద్ద మొత్తంలో నష్టపోయిన తొలి వ్యక్తి మస్కే కావడం విశేషం.

మస్క్ సంపద ఇంత పెద్ద మొత్తంలో పతనం కావడానికి ప్రధాన కారణం టెస్లా షేర్ల పతనమే. ఈ ఆటోమేకర్ కంపెనీ స్టాక్ షేరు ఈ ఏడాది రికార్డు స్థాయిలో పడిపోయింది. మస్క్ ఎక్కువ వాటా టెస్లా షేర్ల రూపంలోనే ఉంది. దీంతో మొత్తం 200 బిలియన్ డాలర్లు కోల్పోయి.. ఇప్పుడు మస్క్ వద్ద కేవలం 137 బిలియన్ డాలర్ల సంపద మాత్రమే ఉంది. అంటే సగానికి పైగా లాస్ అయ్యారు మస్క్.

ఎప్పుడైతే ట్విట్టర్‌ను కొనుగోలు చేశారో అప్పటి నుండి టెస్లా షేర్లు పతనం కావడం ప్రారంభమైంది. ఎలోన్ మస్క్ సంపదలో ఎక్కువ భాగం టెస్లా స్టాక్‌లో ముడిపడి ఉండటంతో దీని విలువ 2022లో 65% క్షీణించింది. ఈ దెబ్బతో ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా తన హోదాను కోల్పోయాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -