ఖమ్మం సభను విజయవంతం చేయండి…

22
- Advertisement -

బీఆర్‌ఎస్ జాతీయాధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాల నేతలతో ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బీఆర్ఎస్‌ జాతీయ పార్టీగా మారిన తర్వాత మొట్టమొదటి సారిగా ఈ నెల 18వ తేదీన భారీ బహిరంగ సభ జరపాలని నిర్ణయించిన వేళ… సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలకు పలు సూచనలు చేశారు. ఖమ్మం పరిధిలో 5లక్షల మందితో సభకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

మూడు రాష్ట్రాల నుంచి సీఎంలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పంజాబ్‌, ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులకు సభ కోసం ఆహ్వానాలను పంపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సభను గ్రాండ్‌ సక్సెస్‌ చేయాలని నేతలకు కేసీఆర్‌ సూచించారు. జిల్లా నేతలందరూ వ్యక్తిగత విభేదాలు వీడి కలిసి పనిచేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు

బీఆర్‌ఎస్ సభను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించినందుకు ఖమ్మం జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర కీలక నేతలు సోమవారం నాడు ప్రగతి భవన్ లో అధినేత సిఎం కెసిఆర్ ను కలిసి తమ కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా అధినేతతో సమావేశమైన ఖమ్మం జిల్లా నేతలు బహిరంగ సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేసేందుకు సంబంధించి చర్చించారు.

మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్, బండి పార్థ సారథి రెడ్డి, రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధు, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, రేగా కాంతారావు, కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, లావుడ్యా రాములు నాయక్, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, తదితర నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు.

ఇవి కూడా చదవండి…

ఖమ్మం జిల్లా నేతలతో సీఎం భేటీ..

తెలంగాణలో వన్‌ స్టాప్ షాప్‌..

టెథాన్‌లో విద్యుత్తు వెలుగులు

- Advertisement -