ఖమ్మం జిల్లా నేతలతో సీఎం భేటీ..

49
kcr
- Advertisement -

బీఆర్ఎస్‌ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి భారీ బహిరంగ సభకు సిద్దమయ్యారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎన్నో సభలు సమావేశాలు ద్వారా ఉద్యమ స్పూర్తిని ప్రజలోకి తీసుకెళ్లిన సీఎం…తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ ద్వారా దేశమంతటా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నెల 18న ఖమ్మంలో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీలు నామానాగేశ్వర్‌రావు, రవిచంద్ర, పార్థసారథి, ఎమ్మెల్యేలు హరిప్రియ, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్‌, ఎమ్మెల్సీ మధు, జడ్పీ చైర్మన్‌ కమల్‌రాజ్‌ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో బీఆర్‌ఎస్‌ సభ ఏర్పాట్లపై ఖమ్మం జిల్లా నేతలతో సీఎం చర్చిస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం కోరిన సీఎం కేసీఆర్‌… ఈ సభ ద్వారా దేశ రైతాంగానికి, రాజకీయ పక్షాలకు స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు. ఈమేరకు పార్టీ ఆవిర్భావం అనంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు పలువురు కీలక జాతీయ నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నది. ఈ సభ ద్వారా దేశ వ్యవసాయ రంగంలో తీసుకొచ్చే విప్లవాత్మకమైన మార్పులను వివరించబోతున్నారు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -