హ్యాట్సాఫ్ అన్న పదం కూడా ఈ ప్రొఫెసర్ ముందు చిన్నదేమో. ఎందుకంటే 9 పదుల వయస్సులోనూ రోజు 140 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థులకు చదువు చెప్పడం అంటే మాములు విషయం కాదు. మాములుగా ఉద్యోగం నుంచి రిటైర్ అయితే చాలు కృష్ణారామ అంటూ మనవళ్లు, మనవరాళ్లతో కాలం గడిపేస్తుంటారు చాలామంది. కొద్దిమంది మాత్రమే భిన్నంగా ఉంటారు. అందులో ఒకరు ప్రొఫెసర్ శాంతమ్మ.
ఇది ఓ స్కూల్లోనో కాళేజీలోనే అనుకుంటే పోరపాటే. సెంచురియన్ యునివర్సీటీ. ఆ వయస్సులో కూర్చోవడమే కష్టం. అలాంటిది శాంతమ్మకు మోకాళ్ల నొప్పులు, రెండు కాళ్లకు సర్జరీ కూడా చేశారు. అయినా తన సంకల్పం ముందు ఆ సమస్యలన్ని చిన్నవై పోయాయి. రోజు వందల కిలోమీటర్లు ప్రయాణించి మరి విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు చెబుతున్నారు.
కృష్టా జిల్లా మచిలిపట్నంలో 1929 మార్చి 8న జన్మించారు శాంతమ్మ. వృత్తిరీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు. 1989లోనే పదవి విరమణ పొందారు. అయినప్పటికీ ఆమె ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా సేవలు అందించారు. ఇప్పుడు 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారు. ప్రతీరోజూ విశాఖపట్నంలో ఉదయం 9గంటలకు భయలుదేరి 140 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి విజయనగరంలోని సెంచూరియన్ యూనియర్సిటిలో పిజిక్స్ బోదిస్తున్నారు. వయోభారం పడుతున్నా వెనకడుగు వెయ్యకుండా ప్రతీరోజు క్రమం తప్పకుండా కాలేజీకి వస్తూ పాఠాలు చెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
క్లాసులోకి వచ్చిన తర్వాత ఎక్కువ సేపు బోర్డు దగ్గర నిలబడి రకరకాలైన అప్టిక్స్ స్ట్రక్చర్స్ గీస్తూ పాఠాలు చెప్తారంటున్నారు విద్యార్థులు . చాక్ పీసుతో చకచక బోర్డుపై డ్రాయింగ్ గీసేస్తూ చెప్తూంటే చాలా సార్లు తామే ఆశ్చర్యపోతామని వెల్లడించారు. పాఠాలతో పాటు జీవితానుభవాలను విద్యార్ధులకు పంచి స్ఫూర్తి కలిగిస్తున్న శాంతమ్మకు నిజంగా హ్యాట్సాఫ్.
ఇవి కూడా చదవండి..