బిఆర్‌ఎస్ తో దేశ రాజకీయాలపై గురిపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్.. పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రలలో బిఆర్‌ఎస్ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బిఆర్‌ఎస్ దేశ వ్యాప్తంగా తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. కేసిఆర్ పాలన దక్షత కు, నాయకత్వ పటిమకు దేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
ఇదిలా ఉంచితే ఈ ఏడాదిలో కర్నాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ గడ్డ.. బిఆర్‌ఎస్ అడ్డా అయినందున ఇక్కడ బిఆర్‌ఎస్ కు తురుగులేదు.. అందువల్ల కేసిఆర్ కర్నాటకపై గట్టిగానే గురి పెట్టారు. ఇప్పటికే కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్ కు మద్దతు ప్రకటించిన సంగతి విధితమే. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసిఆర్ కర్నాటకలో ప్రచారం చేస్తారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసిఆర్ జనతాదళ్- ఎస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా తెలంగాణ మంత్రులంతా కూడా కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆమె అన్నారు. కుమారస్వామి కర్నాటక సిఎం కావాలని కేసిఆర్ ఆకాంక్షిస్తున్నారని సత్యవతి రాథోడ్ వెల్లడించారు. అయితే బిఆర్‌ఎస్ ప్రత్యక్షంగా కర్నాటక ఎన్నికల బరిలోకి దిగుతుందా లేదా జనతాదళ్-ఎస్ పార్టీకి మద్దతుగా మాత్రమే నిలుస్తుందా అనే దానిపై స్పష్టమైన సమాధానం లేదు. ఏది ఏమైనప్పటికి కర్నాటక ఎన్నికలపై కూడా కేసిఆర్ సీరియస్ గానే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరి కర్నాటక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగితే.. ఇప్పుడు జాతీయ పార్టీలుగా వెలుగొందుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బిఆర్‌ఎస్ గట్టి హెచ్చరిక పంపినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఎన్నికల సమయానికి బిఆర్‌ఎస్ దూకుడు ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..