అలియా అది చూపించలేనంటోంది

69
- Advertisement -

బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్ తన లైఫ్ కు సంబంధించి చాలా డీటెయిల్స్ తన ఫ్యాన్స్ కు ఓపెన్ గా చెప్పేస్తోంది. అలియా భట్ చేస్తున్న కార్యక్రమాలు, లైన్లో ఉన్న సినిమాల్ని ఆమె అభిమానులు ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటారు. వీటికి తోడు తన వ్యక్తిగత విషయాల్ని, తన కాపురం సంగతుల్ని కూడా అలియా భట్ ఎప్పటికప్పుడు బయటపెడుతూ ఉంటుంది. అయితే ఎన్ని విశేషాలు చెప్పినా, ఒకటి మాత్రం చూపించలేనంటోంది అలియా.

తన బిడ్డకి సంబంధించిన ఆటపాటలను మాత్రం ఎవ్వరికీ చూపించనంటోంది అలియా భట్. ఇప్పటికే కొందరు హీరోహీరోయిన్లంతా తమ వారసులను చూపిస్తుంటే.. అలియా భట్ మాత్రం నో అంటోంది. తన బిడ్డ, ఇంట్లో చేసే అల్లరిని చూపించడం అలియా భట్ తనకు ఇష్టం లేదంటోంది. అందుకే, ఆ ఒక్కటి అడగొద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. బహుశా.. తన బిడ్డకు దిష్టి తగులుతుందని అలియా భట్ ఫీల్ అవుతుందేమో.

అలియా భట్ తన పండంటి కూతురికి ఏ పేరు పెట్టిందో తెలుసా ? ‘రహా’. తనకు కూతురు పుడితే.. రహా’ అని పెట్టాలని అలియా భట్ ముందే డిసైడ్ అయ్యింది. మాతృత్వంలో నిస్వార్ధ ప్రేమ ఉంటుంది, అందాల తార అయినా, అచ్చతెలుగు ఇల్లాలు అయినా అమ్మతనానికి అందరూ అభిమానులే. అందుకే.. అలియా భట్, తన బిడ్డను అపురూపంగా చూసుకుంటుంది.

ఇవి కూడా చదవండి…

మత్తెక్కిస్తున్న శ్రద్దాదాస్‌..

నేడు వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ రిలీజ్‌

బాలకృష్ణకు తప్పిన పెను ప్రమాదం

- Advertisement -