గంగా విలాస్ క్రూయిజ్..ధర ఎంతంటే..?

42
- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రధాని మోదీ ఈ నెల 10న ప్రారంభించనున్నారు. వారణాసి నుంచి అసోంలోని దిబ్రూగఢ్‌ వరకు బంగ్లాదేశ్‌ మీదుగా 3200కి.మీ దూరం ప్రయాణించనుంది. ఈ ట్రిప్‌ మొత్తం 50రోజుల్లో 27నదులను కవర్‌ చేయనుంది. ఇందులో 18గదులుంటాయని ఒక్కో దాంట్లో 80మంది ప్రయాణికులు సురక్షితంగా ఉండొచ్చు. ఇందులో అధునాతన సౌకర్యాలైన జిమ్‌ స్పా లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

గంగా విలాస్ క్రూయిజ్‌లో ప్రయాణించాలంటే ఇన్‌క్రెడిబుల్‌ బెనారస్ ప్యాకేజీ ధర రూ.112000 నుండి ప్రారంభమవుతుందని అంటారా కంపెనీ ప్రతినిధి తెలిపారు. నాలుగు రోజుల ప్రయాణం వారణాసి నుంచి ఖైతీ వరకు జరుగుతుందన్నారు. ఇందులో విలాసవంతమైన రెస్టారెంట్‌ స్పా మరియు సన్‌డెక్‌ ఉన్ఆయని పేర్కొన్నారు. మెయిన్‌ డెక్‌లోని 40సీట్ల రెస్టారెంట్‌ ఉందని ఇందులో కాంటినెంటల్ ఇండియన్ వంటకాలతో రెస్టారెంట్ అతిథ్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ గంగా విలాస్ ప్రయాణం ద్వారా సుందర్‌బన్ డెల్టా మరియు కజిరంగా నేషనల్‌ పార్క్‌లను సందర్శించవచ్చు. గంగా దిబ్రూగఢ్‌ల మధ్య ఉన్న 50ఆర్కిటెక్చరల్‌ ప్రాంతాలను కూడా వీక్షించవచ్చు.

 

ఇవి కూడా చదవండి…

మొక్కలు నాటిన రిటైర్డ్ జస్టిస్‌…

ఆస్ట్రేలియాలో పంజాబీ భాష…

ఎన్‌హెచ్ఏఐ..సెన్సార్‌లో మార్పులు

- Advertisement -