త్రివిక్రమ్ – మహేష్ కలయికలో రాబోతున్న సినిమా అప్ డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ తో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని క్లారిటీ ఉంది. కాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. త్రివిక్రమ్ టీమ్ ప్రస్తుతం షూటింగ్ కోసం లొకేషన్ల వేటలో ఉంది. పూర్తి ఢిల్లీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. కాబట్టి, సినిమాలో ఓ భారీ చేజింగ్ ఫైట్ ఎపిసోడ్ ఉందట. మొదట ఈ ఎపిసోడ్ షూట్ తోనే సినిమా షూట్ ను ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే, ఆ ఫైట్ లొకేషన్స్ ను వెతికే పనిలో త్రివిక్రమ్ టీమ్ నిమగ్నమై ఉంది.
ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి కూడా ఫ్యాన్స్ ఊగిపోయే అప్ డేట్ ను రివీల్ చేస్తున్నాం. ఇంతకీ మహేష్ పాత్ర ఏమిటంటే.. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పొలిటికల్ అనలైజర్ గా కనిపించబోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ఎంటర్ టైన్ గా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మహేష్ బాబు పాత్రలో మరో కొత్త కోణం కూడా ఉంటుందని.. తెలుగు సినిమా నేటివిటీకి ఫ్రెష్ టోన్ ను ఈ చిత్రం అందించబోతుందని తెలుస్తోంది.
జనవరి 22న నుంచి ఈ చేజింగ్ ఎపిసోడ్ షూటింగ్ మొదలుకానుంది. ఇంతవరకు లొకేషన్ ఫైనల్ కాలేదు. ఒకవేళ అనుకున్న లొకేషన్ దొరకక పోతే.. షూటింగ్ డేట్స్ విషయంలో మళ్లీ మార్పులు ఉండొచ్చు. ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ‘అరవింద సమేత, అలా వైకుంఠపురంలో ఇలా వరుస హిట్ చిత్రాలను అందించి ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు త్రివిక్రమ్. దీనికితోడు ఈ సినిమాకి ఇండియా వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అయ్యేలా ఉంది.
ఇవి కూడా చదవండి…