హీరోయిన్స్ కి సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ లు రావాలన్నా, వచ్చిన ఛాన్స్ లు నిలబడాలన్నా.. సూపర్ హిట్ మూవీ పడాలి. ఆ రేంజ్ హిట్ పడితే.. ఆ హీరోయిన్ జాతకమే మారిపోతుంది. ముప్పై లక్షల హీరోయిన్ కాస్త.. కోటిన్నర కావాలి అంటూ బేరాలు మొదలు పెడుతుంది. హిట్ హీరోయిన్ కాబట్టి, సదరు హీరోయిన్ గొంతెమ్మ కోరికలను నిర్మాతలు తీర్చాల్సిందే. అయితే, విచిత్రంగా టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయకుండా 4 కోట్లు అడుగుతుంది ఓ యంగ్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు, అతిలోక సుందరి శ్రీదేవి అందాల తనయ జాన్వీ కపూర్. ఒక్కో తెలుగు సినిమాకు జాన్వీ కపూర్ 4 కోట్లు కావాలంటూ తన కోరికల చిట్టాను నిర్మాతల మెడకు చుడుతోంది.
అదేంటి ?, జాన్వీ కపూర్ ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు కదా. కావొచ్చు. తన తల్లి శ్రీదేవి కి ఉన్న పాపులారిటీని తాను క్యాష్ చేసుకోవాలని జాన్వీ కపూర్ ఆరాట పడుతుంది. నిజానికి లైగర్ సినిమా ముందు జాన్వీ కపూర్ దగ్గరకే వెళ్ళింది. ఆ సినిమాకి కోటిన్నర అడిగింది. కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత ఆ సినిమా జాన్వీ చేయలేదు. సరే.. ఇప్పుడు ఉన్నట్టు ఉండి.. జాన్వీ కపూర్ ఎందుకు అడ్డు అదుపు లేకుండా తన రెమ్యునరేషన్ ను విచ్చలవిడిగా పెంచింది ?, ఐతే, ఈ విషయంలో జాన్వీ కపూర్ చాలా క్లారిటీగా ఉంది.
ఎప్పుడైతే తనకు కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కన్ ఫార్మ్ అయిందో.. ఇక ఆ క్షణం నుంచి జాన్వీ కపూర్ ఐడియాలజీనే మారిపోయింది. ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ వచ్చేసరికి జాన్వీ కపూర్ డిమాండ్ చేస్తోంది. పైగా మాస్ ప్రేక్షకుల్లో జాన్వీ కపూర్ కి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అలాగే గ్లామర్ విషయంలో కూడా జాన్వీ కపూర్ కు ఫుల్ మార్క్ లు పడతాయి. మరీ అలాంటప్పుడు జాన్వీ కపూర్ ఎందుకు తగ్గాలి?! ఇదే ఆమె అభిప్రాయం.
ఇవి కూడా చదవండి..