ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా తమ తండ్రి సముద్రఖని విసిరిన చాలెంజ్ స్వీకరించి చెన్నై అష్టలక్ష్మీ నగర్ లోని తమ నివాసంలో మొక్కలు నాటారు హరి విఘ్నేశ్వరన్, శివానీ.
ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి గొప్ప ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ముఖ్యంగా తమ తండ్రి విసిరిన చాలెంజ్ స్వీకరించడం గొప్ప అనుభూతినిచ్చిందని అన్నారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు.తమ తండ్రి బాటలో ప్రయాణిస్తూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాద్యత నిర్వహిస్తామని ఈ బృహత్తర ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు.
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 13 లో గల ఇరిగేషన్ ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు నూతన ఇరిగేషన్ డెవ్ లప్మెంట్ కార్పొరేషన్ చేర్మన్ వేణుగోపాల చారి.
ఈ సందర్భంగా వేణుగోపాల్ చారి మాట్లాడుతూ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని ఈ రోజు ప్రమాణ స్వీకారం రోజు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి KCR గారు హరిత ప్రేమకులు అని వారి అడుగుజాడల్లో రాష్టంలో తన వంతు భాద్యత గా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా రాష్టంలో గ్రీనరి పర్సెంటెజ్ పెరిగింది అన్నారు. రాష్టంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మొక్కలు నాటించడం, వాటి ప్రాముఖ్యతను తెలియచేసెలా సంతోష్ కుమార్ గారు కృశి చేస్తున్నారు అన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.