ప్చ్.. పదేళ్ల తర్వాత మొదలెట్టాడు

149
- Advertisement -

దర్శకుడు కె. విజయ భాస్కర్ హిట్ అందుకుని దాదాపు 18 ఏళ్లు అవుతుంది. ఎప్పుడో 2004 లో వచ్చిన మల్లీశ్వరి సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 2005లో చేసిన జై చిరంజీవ ఏవరేజ్ గా ఆడింది. ఇక అప్పటి నుంచి చేసిన సినిమాలన్నీ ప్లాపే. చాలా అంటే చాలా కాలం తరువాత కిందా మీదా పడి 2013లో మసాలా అనే సినిమా అందించాడు. దానికి తెర వెనుక సాయం పట్టిన జనాలు చాలా మంది వున్నారు. ప్రస్తుత క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఈ మసాలా సినిమాకి స్క్రిప్ట్ వర్క్ చేశాడు. అయినా ఆ సినిమా సూపర్ హిట్ ఏమీ కాలేదు.

కాకపోతే.. మసాలా చిత్రం చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఏదో విధంగా బతికి బయటపడింది. మొత్తమ్మీద మసాలా సినిమా దెబ్బతో మళ్లీ కె. విజయ భాస్కర్ కి మరో సినిమా లేకుండా పోయింది. కానీ, నేటికీ కె. విజయ భాస్కర్ మంచి దర్శకుడు అనే అంటారు. ఇండస్ట్రీలో విజయ్ భాస్కర్ కి మంచి పేరు ఉంది. ఎవర్నీ ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు అని ఆయన గురించి చెబుతూ ఉంటారు. అయినా.. ఏ నిర్మాత, ఏ హీరో మళ్లీ కె. విజయ భాస్కర్ ను పిలిచి అడ్వాన్స్ చేతిలో పెట్టిన వారు లేరు. 2018 లో ఓ సినిమా చేయడానికి విజయ్ భాస్కర్ బాగానే ప్రయత్నాలు చేశాడు. సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అనుకునే లోపు కరోనా వచ్చింది.

కరోనా అనంతరం మళ్ళీ కె. విజయ భాస్కర్ సినిమా స్టార్ట్ చేయలేదు. అసలు కరోనా లేకపోతేనే సంవత్సరాల తరబడి సినిమాలు చేసే కె. విజయ భాస్కర్, కరోనా రాకతో మరింత ఆలస్యం చేశాడు. ఇప్పటికే కె. విజయ భాస్కర్ నుంచి సినిమా వచ్చి పదేళ్లు అవుతుంది. ఐతే, ఇప్పుడు కొత్తగా విజయ భాస్కర్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు వినిపించడం ప్రారంభమైంది. హీరో శ్రీవిష్ణు హీరోగా విజయ్ భాస్కర్ ఓ కామెడీ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. టాలీవుడ్ లో మంచి నిర్మాత అని పేరు వున్న కెఎస్ రామారావు ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కెఎస్ రామారావు మంచి నిర్మాత కావొచ్చు. కానీ, ప్రస్తుతం హిట్ లేని నిర్మాత. మరీ ఈ సినిమా ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

హ్యాండ్ ఇచ్చినా ఛాన్స్ ఇచ్చాడు

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రగతి..

‘పుష్ప 2’ పై సందేహాలు

- Advertisement -