సీఎంను కలిసిన నూతన డీజీపీ

48
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా అంజ‌నీ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ ను డీజీపీ అంజనీ కుమార్‌ ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 1992లో జనగామ ఏఎస్పీగా మొదలైన అంజనీ కుమార్‌్ అంచెలంచెలుగా ఎదిగి డీజీపీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత 3వ డీజీపీగా నియమితులయ్యారు. మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ తర్వాత నియమితులైన అంజనీ కుమార్ 2026 జనవరిలో పదవీ విరమణ చేయనున్నారు. అంతకుముందు డీజీపీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీపీలు సీవీ ఆనంద్‌ మహేశ్ భగవత్‌తో పాటు పలువురు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

తొలిసారి ఒంటెలతో మహిళల కవాతు

తల్లి కాబోయే వాళ్ళు.. ఈ ఆసనం వేయాల్సిందే!

గ్రూప్-3లో 1365పోస్టుల భర్తీ

- Advertisement -