సీనియర్ యాక్టర్ వీకే నరేష్ కొంత కాలంగా నటి పవిత్రతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సార్లు ఈ జంటపై మీడియాలో కథనాలు వచ్చాయి . ఈ ఇద్దరి విషయం ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల కూడా తెలిసిపోయింది. కృష్ణ గారి మరణం రోజు ఇద్దరూ అంటిపెట్టుకొని తిరిగారు. అయితే తమ సహజీవనానికి చెక్ పెట్టి త్వరలోనే ఈ జంట పెళ్లి తో ఒకటవ్వబోతుంది.
2022 కి గుడ్ బై చెప్తూ నరేష్ పవిత్ర తో కలిసి ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో పవిత్రకి నరేష్ లిప్ కిస్ పెట్టడం వైరల్ అవుతుంది. వచ్చే ఏడాదిలో తామిద్దరం పెళ్లి చేసుకొనున్నామని వీడియోలో టెక్స్ట్ ద్వారా చెప్పాడు నరేష్. గతంలో నరేష్ కి రెండు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి. అవన్నీ పెడాకులు అవ్వడంతో ఇప్పుడు నటి పవిత్రతో నరేష్ కొత్త జీవితం మొదలు పెట్టాలని భావిస్తున్నాడు.
ఏదేమైనా నరేష్ పవిత్ర లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పెళ్లి చేసుకుంటున్నామని పోస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది కదా ఈ వయసులో లిప్ లాక్ తో ఇలాంటి ఎనౌన్స్ మెంట్ అవసరమా ? అంటూ నరేష్ పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…