పవన్ 3 పెళ్లిళ్ల పై బాలయ్య స్పందన!

1524
- Advertisement -

నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే స్టేజ్ మీద కనిపించబోతున్న సంగతి తెలిసిందే. నిన్న అన్‌స్టాపబుల్ షో సెకండ్ సీజన్ పవన్‌ కళ్యాణ్‌ ఎపిసోడ్‌ షూటింగ్ పూర్తయింది. ఇందులో భాగంగా బాలకృష్ణ.. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వివాదం గురించి ప్రశ్నించారట. దానికి పవన్ కల్యాణ్ చాలా క్లియర్‌గా వివరించినట్టు తెలుస్తోంది. పవన్ సమాధానం విన్న బాలయ్య.. ఇక నుంచి పవన్ కల్యాణ్‌ ను పర్సనల్‌గా టార్గెట్ చేస్తే, వాళ్లు ఊర కుక్కలతో సమానం అని కామెంట్ చేశారట.

మొత్తానికి ఈ ఎపిసోడ్ మరోసారి హైలెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అన్నిటికీ మించి ఈ ఎపిసోడ్ పై ఏపీ రాజకీయాలు కూడా ముడిపడి ఉన్నాయి. కారణం పవన్ – బాలయ్య జగన్ ప్రభుత్వం పై కూడా విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి బాలయ్య – పవన్ ల మధ్య రాజకీయ వార్ ఉన్నా.. ఇప్పుడు ఇద్దరి టార్గెట్ ఒక్కటే. జగన్ ను సీఎం పదవి నుంచి దించడం. ఈ నేపథ్యంలో పవన్ – బాలయ్య రాజకీయాల గురించి ఏం మాట్లాడుకున్నారో చూడాలి.

అసలు బాలయ్య హోస్ట్ గా చేయడం, పైగా ఆ షోకి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రావడం నిజంగా ఎవరూ ఊహించని పరిణామం ఇది. మొత్తానికి బాలయ్య – పవన్ ఎపిసోడ్ సరికొత్త రికార్డ్స్ ను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి…

- Advertisement -