చిరు వర్సెస్ బాలయ్య..భారీ బెట్టింగులు!

146
- Advertisement -

ఈసారి సంక్రాంతి రేసు ఆసక్తికరంగా సాగనుంది. ఎందుకంటే టాలీవుడ్‌ అగ్రహీరోలు చిరంజీవి – బాలకృష్ణ తలపడనున్నారు. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి జనవరి 13న విడుదల కానుండగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 14న రిలీజ్ కానుంది.

ఇప్ప‌టికే రెండు సినిమాల మధ్య పోటీ తారస్ధాయికి చేరుకుంది. రెండు సినిమాల నిర్మాత ఒకరే అయినా ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం నువ్వానేనా అన్నట్లు సాగుతున్నాయి. రెండు సినిమాల్లోనూ శృతీహాస‌నే హీరోయిన్‌.

ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాల క‌లెక్ష‌న్ల‌పై బెట్టింగులు జోరందుకున్నాయి. హైద‌రాబాద్ త‌ర్వాత ఏపీలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఇద్ద‌రు హీరోల అభిమానుల మ‌ధ్య ఇవే బెట్టింగులు న‌డుస్తున్నాయి. ఈ బెట్టింగుల్లో ఎవ‌రు పై చేయి సాధిస్తార‌న్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -