బెస్ట్ ఇండియన్ ఫిల్మ్‌గా ముత్తయ్య…

26
- Advertisement -

ఇంటర్‌నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ది బెస్ట్ ఇండియన్ ఫిల్మ్‌గా ముత్తయ్య సినిమా ఎంపికైంది. కోల్‌కత్తాలో జరుగుతున్న ఇంటర్‌నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్ లో ది బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్‌ గెలుచుకుంది. కాంపిటేషన్‌ ఆన్ ది ఇండియన్ లాంగ్వేజ్ ఫిలింస్ కేటగిరీలో ఈ పురస్కారం అందుకున్న తొలిసినిమాగా ముత్తయ్య నిలిచింది. దీంతో చిత్ర దర్శకనిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు కే సుధాకర్ రెడ్డి అరుణ రాజ్ మౌనిక బొమ్మ పూర్ణ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను భాస్కర్ మౌర్య తెరకెక్కించారు.

హైలైఫ్ ఎంటర్‌ టైన్‌ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిక్షనరీ ఎంటర్టైన్ మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కేదార్ సెలంగంశెట్టి వంశీ కారుమంచి వ్రిందా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గతంలో ఈ సినిమా యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. కాగా ఈ సినిమా ఈయేడాది మే 9న లండన్‌లోని రిచ్‌ మిక్స్‌లో ప్రీమియర్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి…

ఇలా చేయాలంటే దేవుడి పర్మిషన్ ఉండాలి..

ఈ వారం ఓటీటీ కంటెంట్

ప్చ్.. బాలయ్య ఏం చేస్తాడో ?

- Advertisement -