రవితేజ లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ మాస్ ప్రేక్షకులను మెప్పిస్తూ థియేటర్స్ లో సందడి చేస్తోంది. మాస్ కంటెంట్ తో పర్ఫెక్ట్ మీటర్ సెట్ చేసుకున్న రవితేజ ఈ సినిమాతో మంచి వసూళ్ళు రాబడుతున్నాడు. మొదటి రోజే బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న మాస్ రాజా రెండో రోజు , మూడు రోజు కూడా భారీ వసూళ్ళు అందుకున్నాడు. వీకెండ్, పైగా క్రిస్మస్ హాలిడేస్ అన్నీ కలిసి రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది.
అయితే ఈ మధ్య హిట్ టాక్ తెచ్చుకున్న చాలా సినిమాలు మూడు రోజులు మంచి వసూళ్ళు అందుకొని ఆ తర్వాత డీలా పడ్డాయి. గాడ్ ఫాదర్ , యశోదా ఇలా రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్స్ అన్నీ మూడో రోజు కలెక్షన్స్ పరంగా దారుణంగా డ్రాప్ అయ్యాయి. మరి ఇప్పుడు ధమాకా ఆ టాస్క్ దాటేసి మండే కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ తెచ్చుకుంటే ఇక రవితేజ సినిమాకు తిరుగే ఉండదు. ఇప్పటికే ముప్పై కోట్లకు పైగా గ్రాస్ సాదించిన ఈ సినిమాకు మరో కాంపిటీషన్ సినిమా లేకపోవడం ప్లస్ అయ్యింది.
వచ్చే నెల సంక్రాంతి వరకూ థియేటర్స్ లో పెద్ద సినిమా లేకపోవడంతో ధమాకా అప్పటి వరకూ సౌండ్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ సినిమా సోమవారం గండం దాటేసి ఇవే వసూళ్ళు కంటిన్యూ చేస్తే రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంటుంది అందులో సందేహమే లేదు.
ఇవి కూడా చదవండి…