ఖబడ్దార్‌ బీజేపీ.. కదంతొక్కిన బీఆర్ఎస్‌ శ్రేణులు

34
- Advertisement -

కేంద్రంలోని మోదీసర్కార్‌ అవలంభిస్తున్న అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్‌ శ్రేణులు కదం తొక్కాయి. ఇప్పటికే మోదీ సర్కార్‌… తెలంగాణ రాష్ట్రంపై కక్ష్య గట్టి.. రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సి పోయి… సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నసంగతి తెలిసిందే.

యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు

మెదక్ జిల్లాలో జరిగిన ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి 

తాజాగా కేంద్రప్రభుత్వం మరోసారి తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్‌ పై విషం చిమ్మే ప్రయత్నం చేసింది. తెలంగాణ రైతుల సంక్షేమం, వారి సర్వతోముఖాభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసే కుట్రకు తెరలేపింది మోదీ సర్కార్‌. తెలంగాణ రాష్ట్రంలో పంట కల్లాలకు ఉపయోగించిన ఉపాధి నిధులను వెనక్కి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర సర్కార్‌ ఒత్తిడి చేయడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్ర సర్కార్‌ విధానాలపై మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరసనకు దిగాయి బీఆర్‌ఎస్‌ శ్రేణులు. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు.

 

- Advertisement -