ప్రభాస్‌ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కృతి

104
- Advertisement -

తనపెళ్లిపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై హీరోయిన్ కృతి సనన్‌ ఘాటుగా స్పందించింది. నిజానికి గత కొంత కాలంగా టాలీవుడ్‌ మోస్ట్‌ఎలిజిబుల్‌ బ్యాచ్‌ లర్ ప్రభాస్‌, హీరోయిన్ కృతి సనన్‌ ల మధ్య ఏదో నడుస్తోంది.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆదిపురుష్‌ సినిమా లో భాగంగా వీరిద్దరు పలు వేదికలపై క్లోజ్ ఉన్న ఫోటోలతో పాటు వీడియోలు చూస్తే.. ఇది నిజమేనని అనిపించకమానదు.

అయితే ఇప్పుడు ఈ విషయంపై కృతిసనన్‌ నోరు విప్పింది. ప్రభాస్‌ ఊ అంటే.. తాను పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా ఓ టీవీ షోలో కృతి కో స్టార్‌ వరుణ్‌ ధావన్‌ ఏకంగా ‘ప్రభాస్‌ మనసులో కృతి ఉంది’ అంటూ కామెంట్‌ చేశాడు. అయితే ప్రభాస్‌ పేరు నేరుగా చెప్పకపోయినా.. ‘ముంబయిలో లేడు, దీపికతో నటిస్తున్నాడు’ అంటూ ఏవేవో చెప్పుకొచ్చి హింట్‌ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై కృతి స్పందించింది. ప్రభాస్‌ కు, తనకు మధ్య ఏదో ఉన్నట్లు సోషల్‌ మీడియాలో పలు వార్త కథనాలు పుట్టుకొస్తున్నాయి. కానీ మీరు అనుకుంటున్నట్లు మా మధ్య ఏం లేదు.. అని కృతి క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -