ఏపీలో సిఎం జగన్ ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ ఇక తాజాగా మరో విప్లవాత్మక మార్పుకు కూడా జగన్ శ్రీకారం చుట్టారు. ఇకపై ఆరవ తరగతి నుంచే డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. బాపట్ల జిల్లాలో సిఎం జగన్ పర్యటిస్తుండగా చుండూరు మండలం యడ్లపల్లి గ్రామంలో స్థానిక జెడ్పీ హై స్కూల్ లోని 8వ తరగతి విధ్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు అందించిన సిఎం జగన్.. ఆ తరువాత జరిగిన బహిరంగ సభలో పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.
పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి తనకు ఎంతో భాద కలిగిందని, విధ్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. పిల్లల భవిష్యత్ ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. అందులో భాగంగానే డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టినట్లు సిఎం జగన్ వ్యాఖ్యానించారు. నాడు నేడు లో భాగంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు డిజిటల్ క్లాసులు వచ్చే జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయని సిఎం జగన్ వెల్లడించారు.
నాడు నేడు పూర్తయిన స్కూళ్ళలో మొదట ఈ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు వ్యాఖ్యానించారు. ఇక దేశంలోనే తొలిసారిగా 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ ల పంపిణీ చేశారు సిఎం జగన్. ఇలా ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ట్యాబ్ ల ద్వారా విధ్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమౌతాయని, నెట్ తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూడవచ్చని చెప్పుకొచ్చారు. వీటిలో బైజూస్ లెర్నింగ్ యాప్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, బయాలజీ, సివిక్స్, హిస్టరీ, వంటి సబ్జెక్ట్ ల పాఠాలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ తో పాటు మరో 8 భాషలలొ అందుబాటులో ఉంటాయని సిఎం జగన్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి…