ఛాతీలో నొప్పి.. నిర్లక్షం చేస్తే అంతే సంగతులు !

145
- Advertisement -

సాధారణంగా చాలా మందికి అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి వస్తూ ఉంటుంది. అయితే ఈ ఛాతీ నొప్పి రావడానికి రెండు కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా గ్యాస్ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఈ గ్యాస్టిక్ సమస్య కారణంగా కూడా ఛాతీలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇక రెండవ కారణం గుండె సంబంధిత సమస్యలు కావచ్చు. గ్యాస్టిక్ వల్ల వొచ్చే నొప్పి వల్ల పెద్దగా ప్రమాదం లేకపోయినప్పటికి, గుండె సంబంధిత సమస్యలలో హార్ట్ ఎటాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఏది గ్యాస్టిక్ సమస్య.. ఏది హార్ట్ ఎటాక్ సమస్య అని గుర్తించడం చాలా కష్టం.

అందువల్ల ఛాతీలో చిన్నపాటి నొప్పి వచ్చిన వెంటనే డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఈ ఛాతీ నొప్పి అనేది మొదట ఎదురు రొమ్ములో ప్రారంభమై మెడ కింది భాగానికి, అలాగే ఎడమ భుజం వైపునకు వ్యాపిస్తుంది. హార్ట్ ఎటాక్ తో వచ్చే నొప్పి అయితే కనీసం 2 నిముషాల నుంచి 3 నిముషాల వరకు అలాగే కంటిన్యూ అవుతుంది. అంతే కాకుండా ఈ నొప్పి వచ్చే టైంలో చెమటలు పట్టడం, గుండె దడ దడ గా కొట్టుకోవడం, కొంత మందిలో ఆయాసం కూడా వస్తుంది. అలాగే కొందరిలో నడిచినప్పుడు లేదా పరిగెత్తినప్పుడు కూడా ఛాతీ నొప్పి వస్తుంది. అలాగే వ్యాయామం చేసే టైంలోను, ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు కూడా ఛాతీలో నొప్పి వస్తుంది.

Also Read:ఫెడ్ ఔట్ డైరెక్టర్ కి చిరు బ్రేక్ ఇస్తాడా..?

ఇలాంటి నొప్పిని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయరాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది హార్ట్ అటాక్ కావొచ్చు. అందువల్ల వెంటనే వైద్యుడిని సంప్రదించి.. ఈసీజీ, 2డి ఈకో, వంటి టెస్టులు చేయించుకొని వాటిలో పాజిటివ్ వస్తే హార్ట్ ఎటాక్ గా పరిగణించవచ్చు. ఇక గ్యాస్టిక్ నొప్పిలో బొడ్డు పైభాగంలో మంటల వస్తుంది. అలాగే గ్యాస్టిక్ నొప్పి అయితే తెంపులు కూడా వస్తాయి. ఇవే కాకుండా ఎముకలు, కండరాలు కదిలించినప్పుడు కూడా ఛాతీలో నొప్పి వస్తుంది. ఇంకా ఊపిరితిత్తుల సమస్యల వల్ల కూడా ఛాతీలో నొప్పి రావడం జరుగుతుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇలా రకరకలా కారణాల వల్ల ఛాతీలో నొప్పి వస్తుంది. అయితే కారణాలు ఏవైనప్పటికి.. ఛాతీ నొప్పిని నిలక్ష్యం చేయరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Also Read:అల్ బకార పండ్లతో.. ఎన్ని లాభాలో !

 

- Advertisement -