బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చిక్.. గ్లింప్స్

45
- Advertisement -

ఈటీవీ ప్రభాకర్ తనయుడు, యాటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్ కథానాయకుడిగా ఆర్కెఏకే ఫిలిమ్స్, ఐఈఎఫ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై దర్శకుడు కృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చిక్’. కిరణ్ బోయినపల్లి, కిరణ్ జక్కంశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విదేశీ నటి కేట్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇటివలే హీరో చంద్రహాస్ పాత్రని పరిచయం చేస్తూ గ్లింప్స్ టీజర్ ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో చంద్రహాస్ స్క్రీన్ ప్రజన్స్, యాక్షన్, బ్రిలియంట్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హీరోయిన్ కెట్ గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్.

ఈ గ్లింప్స్ లో కేట్ తన అందచందాలతో ఆకట్టుకుంది. కేట్ గ్లామర్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అలాగే చంద్రహాస్ చెప్పిన డైలాగులకలు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రానికి CNU బీట్స్ సంగీతం అందిస్తున్నారు. ఎన్విఆర్ పిప్పల, వైఆర్ శేఖర్ డీవోపీగా, తిరుపతి రెడ్డి ఎడిటర్ గా పని చేస్తున్నారు. రామ్ సుంకర యాక్షన్ సమకూరుస్తున్నారు.

తారాగణం: చంద్రహాస్, కేట్, దయా, చైతన్య, అభిచంద్ర, రుద్రతేజ్ తదితరులు

టెక్నికల్ టీమ్ :
దర్శకత్వం: కృష్ణ
బ్యానర్స్ : ఆర్కెఏకే ఫిలిమ్స్, ఐఈఎఫ్ కార్పొరేషన్
నిర్మాతలు: కిరణ్ బోయినపల్లి, కిరణ్ జక్కంశెట్టి
మ్యూజిక్ : CNU బీట్స్
డీవోపీ: ఎన్విఆర్ పిప్పల, వైఆర్ శేఖర్
ఎడిటర్ : తిరుపతి రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: అడ్డాల రాజు
యాక్షన్ : రామ్ సుంకర
పీఆర్వో: వంశీ- శేఖర్

- Advertisement -