బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మరికాసేపట్లో ముగియనుంది. ఈ సీజన్ విజేత ఎవరో మరికాసేపట్లో తెలియనుండగా గ్రాండ్ ఫినాలే ఆధ్యంతం ఆసక్తిగా సాగుతోంది. ఇక ఈ సీజన్లో ప్రముఖ యాంకర్ నేహా చౌదరి కూడా పాల్గొనగా తాను చేసుకోబోయే వ్యక్తి తన క్లాస్మేట్ అని, ఇంజనీరింగ్‌లో కలిసి చదువుకున్నామని చెప్పింది.
తాజాగా గ్రాండ్ ఫినాలేలో పాల్గొని కాబోయే భర్త పేరు కూడా వెల్లడించింది. ఇవాళ రాత్రి నేహా పెళ్లి జరగనుండగా పెళ్లికూతురు చీరలోనే పార్టీకి హాజరైంది. తనకు కాబోయే భర్త పేరు అనిల్ అని తెలిపింది. పెళ్లికూతురుని చేసిన తరవాత బయట వేరే కార్యక్రమంలో పాల్గొన్న తొలి అమ్మాయిని తానేనేమోనని చెప్పింది.
సరిగ్గా బిగ్ బాస్ ఫినాలే పూర్తయిన సమయానికి తన పెళ్లి ముహూర్తమని ఆమె తెలిపింది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఫైనలిస్టులు బయటికి వచ్చి అటునుంచి అటే తన పెళ్లికి వచ్చేయాలని కోరింది.కరెక్ట్‌గా రాత్రి 10 గంటలకు ముహూర్తమని వెల్లడించింది. ఒక మంచి వ్యక్తి తనకు భర్త కాబోతున్నాడని.. ఈ విషయంలో తాను చాలా లక్కీ అని నేహా చెప్పింది.
ఇవి కూడా చదవండి..