తెలంగాణలో ప్రస్తుతం వైఎస్ షర్మిలా రాజకీయం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె పాదయాత్రల్లో ఘాటైన విమర్శలతో హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు పాదయాత్ర చేపట్టినప్పటికి.. ఆమె పాదయాత్రను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. దాంతో అధికార టిఆర్ఎస్ నేతలపై ఘాటైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ షర్మిల రాజకీయ లభ్ది పొందేందుకు చూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక తాజాగా మరో అడుడు ముందుకేస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుండి బరిలో దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నదే తడవుగా పాలేరులో పార్టీ కార్యాలయానికి భూమిపూజ కూడా చేశారు. అయితే ఈ పూజా కార్యక్రమంలో షర్మిల వ్యవహరించిన తీరుతో విమర్శల పాలైంది.
ఈ సందర్భంగా పాలేరుకు వచ్చిన షర్మిలకు పూర్ణ కుంభం తో స్వాగతం పలికిన పూజారులను మరియు బొట్టు పెట్టి స్వాగతం పలకడానికి వచ్చిన మహిళలను బొట్టు వద్దని చీదరించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలే పాదయాత్రకు అంతంతమాత్రం స్పందన దీనికి తోడు తన వ్యవహారశైలీతో చిక్కుల్లో పడుతున్నారు షర్మిల. ఈ ఘటనపై పలువురు హిందూ సంఘాల నాయకులు షర్మిలకు హిందూ ధర్మం పై గౌరవం లేదని విమర్శ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇది తన రాజకీయ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని దుయ్యబడుతుండగా దీనిపై ఆమె ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి..
ఇవి కూడా చదవండి..