- Advertisement -
తెలంగాణ రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్తను తెలిపారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ను సీఎం కేసిఆర్ ఆదేశించారు.
రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం గాను రూ. 7,600 కోట్లను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది.దీంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇవి కూడా చదవండి..
- Advertisement -