ఈ చలికాలంలో చాలమందిని తరచూ వేధించే సమస్య జలుబు. వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల కారణంగా చలికాలంలో జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలకు త్వరగా గురి అవుతుంటాము. వీటినుంచి ఉపశమనం పొండడానికి ఒక టీ స్పూన్ వాము ను నిప్పులపై వేసి ఆ పొగను పీల్చితే సాధారణ జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక దగ్గు జలుబు ను తగ్గించడంలో మిరియాలు కూడా అద్బుతంగా పని చేస్తాయి.ఒక గ్లాస్ మంచి నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, మరొక టేబుల్ స్పూన్ మిరియాల పొడి కలిపి తీసుకుంటే దగ్గు వెంటనే తగ్గిపోతుంది.
తామర
ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మెడపైన లేదా నడుము పై ఈ తామర సమస్య కొందరిలో అధికంగా కనిపిస్తూఉంటుంది. ఇంకా కాళ్లు మరియు చేతుల వేళ్ళ మద్యలో కూడా ఈ తామర ఏర్పడుతుంది. దీనివల్ల విమరితమైన దురద, మంట ఏర్పడి చాలా ఇబ్బంది పెడుతుంది. అంతే కాకుండా నలుగురిలో ఉన్నప్పుడూ ఈ తామర వల్ల మననుంచి వాళ్ళు దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ తామరను తగ్గించడానికి బయట పలు రకాల మెడిసన్స్ అందుబాటులో ఉన్నప్పటికి. మన ఇంట్లో దొరికే కొన్నిటి ద్వారా తామరను ఈజీగా తొలగించవచ్చు. కరక్కాయను మెత్తగా నూరి ఆ పొడికి కాసింత ఇంక్ ను జోడించి బాగా కలపాలి తరువాత ఆ మిశ్రమాన్ని తామర ఏర్పడిన చోట పూయలి. ఇలా రోజు చేయడం వల్ల మూడు నుంచి నాలుగు రోజుల్లో తామర మటుమాయం అవుతుంది.
గ్యాస్ నివారణ
భోజనం తరువాత చాలా మందిని గ్యాస్ సమస్య వేదిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మాంసాహారం తీసున్నప్పుడు లేదా సమయాభావం లేకుండా భోజనం చేసినప్పుడు ఈ గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. అయితే ఈ గ్యాస్ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొండడానికి రెండు లేదా మూడు లవంగలను నోట్లో వేసుకొని నమిలి మింగితే గ్యాస్ నుంచి వెంటనే విముక్తి పొందవచ్చు.
ఇక శరీరంలో అధిక వేడి కారణంగా చాలమందికి విపరీతమైన చెమటలు పడుతుండడం జరుగుతూ ఉంటుంది. దీనికి వంటింట్లో దొరికే గసగసాలలను మెత్తగా నూరి ఒక టేబుల్ స్పూన్ పొడిని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది.