యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – మారుతీ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. కోకాపేట్‌లోని ఆచార్య ధర్మస్థలి సెట్లో షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్లో సినిమాకు సంబంధించిన ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమా పూర్తయ్యే వరకు ప్రతి నెలా ఏడు రోజుల సమయం ఇవ్వనున్నాడు ప్రభాస్. సలార్ రిలీజ్ తర్వాత ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. హారర్ యాంగిల్‌తో ఈ సినిమా ఉంటుందని, ప్రభాస్‌కు స్పిరిట్ వస్తుందని టాక్ వినబడుతుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌పై రెబెల్ ఫ్యాన్స్ హ్యాపీగా లేరు కాబట్టి ఎలాంటి మీడియా అప్డేట్లు లేకుండా సైలెంట్‌గా షూటింగ్ జరుగుతుంది. మారుతీ ఈ మధ్య కాలంలో ఫామ్‌లో లేడు. ఆయన గత చిత్రం పక్కా కమర్షియల్ భారీ డిజాస్టర్. బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌కి కూడా హిట్ పడలేదు. మరి మారుతీ ఎలాంటి మూవీ డెలివరీ చేస్తాడో ? చూడాలి.
ఇవి కూడా చదవండి..