దసరా ఆగేది లేదు…

25
- Advertisement -

నేచురల్ స్టార్‌ నాని నటిస్తున్న తాజా చిత్రం దసరా షూటింగ్‌కు బ్రేక్ పడింది. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నాడని టాలీవుడ్‌లో టాక్. అందుకు కారణం అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్లే సినిమాలకు బ్రేక్‌ పడిందని దాంతో హిట్‌2 సినిమాను ప్రమోట్‌ చేస్తూ బిజీగా గడిపాడు. అయితే దసరా సినిమా ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలని సంకల్పించుకొని శరవేగంగా షూటింగ్‌ చేస్తున్నారు.

దసరా సినిమాకు సంబంధించిన పోస్టర్, ఒక మాస్ పాట విడుదలతో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసుకున్నాడు నాని. ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించడంతో ఈ సినిమా విషయంలో నాని దూకుడును చూపించాలనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరీ వేచి చూడాలి ఈ సినిమా సమ్మర్‌లో కూల్‌గా ఉంటుందా లేక హాటుగా ఉంటుందా.

ఇవి కూడా చదవండి…

ఆ బయోపిక్ లో బాలయ్య… పెద్ద డౌటే

కత్రినా…2022 మోస్ట్‌ సెర్చ్‌డ్ వుమెన్‌

పులి టీజర్ లాంచ్‌…

- Advertisement -