ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్…మరో అదిరే ఫీచర్స్‌ని తీసుకొచ్చింది.
ఇకపై ఎవరైనా మెసేజ్ పంపితే ఒక్కసారి మాత్రమే ఆ మెసేజ్ చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సదరు మెసేజ్ కనిపించకుండా పోతుంది. మెసేజ్ పంపిన వారికి, అందుకున్న వారికి ఆటోమేటిక్‌గా డిలిట్ అయిపోతుంది. అదే వ్యూ వన్స్ మెసేజ్ ఫీచర్. అంటే ఇక నుంచి ఎవరైనా మనకు పంపిన మెసేజ్‌ను ఇతరులకు ఫార్వర్డ్ చేయడం కుదరదు.
ఇప్పటికే వాట్సాప్‌లో వన్స్ వ్యూ ఫీచర్.. వీడియోలు, ఫొటోలకు వినియోగంలో ఉంది. వీడియోలు లేదా ఫొటోలకు వన్స్ వ్యూ ఫీచర్ ఆప్షన్ ఎంచుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా కుదరదు. వాట్సాప్ ఇదే ఫీచర్‌ను టెక్ట్స్ మెసేజ్‌కు వర్తింప జేయాలని ఆలోచన చేస్తోంది.
ఇవి కూడా చదవండి..